రామ్ గోపాల్ వర్మకి ఒంగోలు పోలీసులు మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మ వాట్సప్‌కి రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు పంపారు. గతంలో ఆర్జీవీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. దీంతో గతేడాది నవంబర్ 10న వర్మపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.