AP: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న ఓ లాడ్జిలో ఆదివారం రాత్రి కొందరు ఒక రూమ్ తీసుకున్నారు. అయితే వీరి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. సోమవారం ఉదయం చూసేసరికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. దాంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. మద్యం సీసాతో యువకుడి తలపై కొట్టి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.