AP: తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని తలకోన జలపాతం అందాలను మాటల్లో వర్ణించలేం. ‘ఫెంగల్’ తుఫాన్ ప్రభావంతో తలకోన జలపాతం వద్ద అటవీ అధికారులు ఇవాళ ఆంక్షలు విధించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తలకోన జలపాతానికి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం వద్ద వారం పాటు ఆంక్షలు విధించారు.