ఆసిఫాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్ద పులి జాడ ఎట్టకేలకు లభ్యమైంది. జిల్లాలోని సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులోని వాగు వద్ద పులి ఉన్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం మహారాష్ట్రకు 2 కి.మీల దూరంలో ఉండటంతో పులి కదలికలపై కన్నేసి ఉంచారు. కాగా ఈ పులి ఆదివారం మేకల మందపై దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై పులి దాడి చేయగా వారిలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.