TG: ముగ్గురిపై పెట్రోల్ పోసి చంపిన కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు మరణ శిక్ష విధించింది. 2022లో HYD నారాయణగూడకు చెందిన సాయిలు.. తన భార్య, ఆమె ప్రియుడు, చిన్నారిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు. సుదీర్ఘ వాదనల అనంతరం మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. సాయిలుకు సహకరించిన అతని ఫ్రెండ్ రాహుల్‌కు రూ.1000 జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.