మార్చి నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు: కేంద్రమంత్రి

81చూసినవారు
మార్చి నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు: కేంద్రమంత్రి
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తాడికొండలో ఏర్పాటు చేసిన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్ ను స్థానిక ఎమ్మెల్యే శ్రావ‌ణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 4,500 టవర్ల ద్వారా నాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్