బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు

583చూసినవారు
బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు
లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్ (కాంటీన్)లలో ఒకటైన, కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ను టీటీడీ రద్దు చేసింది. జూన్ నెలలో సదరు హోటల్‌కు తుది నోటీసులు జారీ చేయడమైనది. లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్‌ను రద్దు చేశారు. టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం ఆ హోటల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్