AP: జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బృందం భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. 'చంద్రబాబు నిజంగా విజనరీ నాయకుడు. అన్ని రంగాల్లో చంద్రబాబే మనకు స్ఫూర్తి. చంద్రబాబు.. ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు' అని రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా, దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో సీఎం చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.