భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన పత్తి

68చూసినవారు
భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన పత్తి
కొమరంభీం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైనూరు మండల కేంద్రంలోని ఓ పత్తిమిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అనేక క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్