TG: నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కట్టంగూరు మండల పరిధిలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.