ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పికప్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.