ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు చేసి వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ వ్యామోహంలో పడి చాలా మంది ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తల్లి తన బిడ్డను అజాగ్రత్తగా మంచం మీదకు విసిరేసి రీల్స్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు. ‘ఈమె అసలు తల్లేనా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.