భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇరు దేశాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన సుఖ్‌దేవ్ పూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో జరిగింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద పనిచేసుకుంటున్న భారత రైతులు.. బంగ్లాదేశ్ రైతులు తమ పంటను దొంగిలించారని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్దకు చేరుకుని ఘర్షణ పడ్డారు. తిట్టుకుంటూనే, రాళ్లదాడులకు పాల్పడ్డారు. BSF, BGB సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.