విజయ్ హజారే ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టుపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది. సమరన్ రవిచంద్రన్ 101 పరుగులు చేశాడు. అనంతరం విదర్భ 312 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ 110 చేసినా ఓటమి తప్పలేదు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాష్ తలో 3, హర్దిక్ రాజ్ ఒక వికెట్ తీశారు.