AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి కూటమి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. ఇప్పటికే చాలామంది బాధితులకు బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేశారు. అయితే కొందరికి ఇప్పటివరకు నగదు జమ కాలేదు. అలాంటి వారికి నేరుగా సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందించినట్లు అధికారులు తెలిపారు.