మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్లకార్డు దారుల కనెక్షన్లకు పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి రూ.3,640 కోట్లు ఖర్చవుతాయి. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1,763 కోట్లు అవుతుంది. పౌరసరఫరాల శాఖ నివేదిక ఆధారంగా సీఎం ఆమోదం తెలపనున్నారు.