AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశారు. 'నిప్పు లాంటి మనిషి అంటే తుప్పు లాంటి మనిషి అని అర్థం. ఆరు నెలల్లో కక్ష సాధింపు తప్పా అభివృద్ధి లేదు. కక్ష సాధింపులకు భయపడే వ్యక్తులం కాదు. చంద్రబాబు అబద్ధాలన్నీ లెక్కిస్తే గిన్నిస్ బుక్‌లో ఎక్కించవచ్చు' అని అంబటి సెటైర్లు వేశారు.