ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల ఏళ్ల పాటు చేసిన తపస్సు ఫలితాలోస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయాలి. అయితే ఈ ఏడాది జనవరి 09న వైకుంఠ ఏకాదశి వచ్చింది.