AP: 2024 ఏడాదిలో తిరుమల శ్రీవారికి వచ్చిన హుండీ ఆదాయం వివరాలను టీటీడీ గురువారం ప్రకటించింది. ఈ క్రమంలో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. 2024 ఏడాదిలో మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించారని.. మొత్తం 12.44 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు చెప్పింది.