ఏపీ ప్రభుత్వం పింఛన్ల వ్యవహారంలో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో అనర్హులుగా ఉన్నవారు పెద్ద సంఖ్యలో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బోగస్ పింఛన్ల ఏరివేతకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.