ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు యల్లమంద గ్రామంలో చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. యల్లమందలో తలారి శానమ్మ, మరో లబ్ధిదారుడు సురేష్ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లి పింఛన్లు అందించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.