మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ జోగి రమేష్ మైలవరంలో ఒక పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ క్యాడర్‌తో ఆయన నిర్వహించిన సమావేశంలో తాను వైసీపీని వీడను అని అన్నారు. దీంతో జోగి రమేష్ పార్టీ మారనున్న వచ్చిన వార్తలకు చెక్ పడినట్లే.