AP: తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలు లక్ష్మీరెడ్డి ఫిర్యాదుతో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను నమ్మించి మాయమాటలు చెప్పి మోసం చేశాడని, చంపేస్తానంటూ బెదిరించాడని లక్ష్మీరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.