దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి (VIDEO)

56చూసినవారు
కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరిరోజున నిర్వాహకులు రెండు ఏనుగులను తీసుకువచ్చారు. ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చడంతో ఏనుగులు బెదిరిపోయాయి. భక్తుల్ని తొక్కుకుంటూ, దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్