రైలు ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్ అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిలబడిన వారిపై వాటర్ ట్యాప్‌తో నీళ్లు పోసి వారిని చెదరగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా అక్కడికి జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణం చేయడానికి రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులను చెదరగొట్టేందుకు రైల్వే పోలీస్ వారిపై నీళ్లు చల్లాడు.