చిత్తూరు తాలూకా నూతన ఎస్‌ఐగా రమేశ్‌ బాబు

83చూసినవారు
చిత్తూరు తాలూకా నూతన ఎస్‌ఐగా రమేశ్‌ బాబు
చితూరు తాలూకా నూతన ఎస్‌ఐగా రమేశ్‌ బాబు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు అధికారులు సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు. కళాశాల విద్యార్ధులు, యువత మత్తుకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోకు ఆదేశానుసారం అధికారుల సమన్వయంతో ఫ్రెండ్లీ పోలీస్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్