ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మంగళవారం డిమాండ్ చేశారు. నగరి అర్బన్, రూరల్ పరిధిలోని కార్మికులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులపై రాజకీయ వేధింపులు తగదన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు. జమున, వేలన్ కృష్ణవేణి, వనిత, సూర్య ప్రభ పాల్గొన్నారు.