కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 9 వార్డుకు సంబంధించి మోడల్ కాలనీలో బుధవారం ఉదయం కుప్పం మునిసిపల్ కమిషనరు శ్రీనివాసరావు చే నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ప్రజల నుండి వివిధ రకాల సమస్యల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్, రేషన్ కార్డులకు సంబందించిన పిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీ దారులకు అక్కడికక్కడే ఎండార్స్ మెంట్ జారీ చేయడం జరిగినది.