ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: సీపీఐ

67చూసినవారు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మంగళవారం డిమాండ్ చేశారు. నగరిలో ఆయన మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన క్వారీ లైసెన్సులను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాలని కోరారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్