పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు గురువారం 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ప్రధానోపాధ్యాయులు గోపి మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలం నేడు మన స్వాతంత్రం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యతగా చదివి దేశోన్నతికి కృషి చేయాలని తెలిపారు.