పూతలపట్టు: మద్యం దుకాణం వద్ద ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాల వద్ద ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారని విమర్శలు వస్తున్నాయి. యాదమరి మండలంలో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మద్యం దుకాణం నిర్వహిస్తున్న దుకాణదారుని పూతలపట్టు ఎమ్మెల్యే అనుచరులు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం షాప్ తెరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించి దౌర్జన్యానికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.