కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మహేందర్ రెడ్డి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కాణిపాకం ఆలయ తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్ స్పెక్టర్ చిట్టిబాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు.