గోకులం షెడ్ల నిర్మాణాన్ని డిసెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ జెడి ప్రభాకర్ మంగళవారం ఆదేశించారు. తవణంపల్లి వెలుగు కార్యాలయంలో పాడి రైతులతో సమావేశమయ్యారు. కలెక్టర్ ఆదేశానుసారం వెంటనే గోకులం షెడ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. అధికారులు ప్రతి దశలోనూ పర్యవేక్షణ చేపట్టాలన్నారు.