పూతలపట్టు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు పలమనేరు డి. ఎస్. పి ప్రభాకర్ ఆదివారం తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు బ్లాక్ స్పాట్ వద్ద పోలీస్ ఎస్కార్ట్, స్పీడ్ బ్రేకర్లు, హైవే మొబైల్ పెట్రోలింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. బంగారు పాల్యం సీఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ మల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.