ఈనెల పది లోపు డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోండి

70చూసినవారు
ఈనెల పది లోపు డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోండి
చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులలో ప్రవేశానికి విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 15వ తేది సబ్జెక్టులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 19న సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్