చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని జోడిచింతల నుంచి కనికాపురం వరకు డ్యామేజ్ అయిన చిత్తూరు- గుడియాత్తం రహదారిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ రోడ్డును మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్&బీ ఎస్ఈ ఉమామహేశ్వర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.