సత్యవేడులో ఘనంగా నాగుల చవితి పండుగ
సత్యవేడు మండలంలో నాగుల చవితి పండుగను భక్తులు ఆనంద ఉత్సాహల మధ్య జరుపుకున్నారు. మంగళవారం నాగుల చవితిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నాగ దేవత ఆలయాలకు చేరుకుని సాంప్రదాయ బద్ధంగా పుట్టలో పాలు, కోడిగుడ్డు వదిలి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సత్యవేడు పట్టణంలో కుమ్మరిగుంటలో బాలనాగారప్ప, మాతంగిశ్వర స్వామి ఆలయ మార్గంలో బాల నాగాలమ్మ, నాగాలమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.