బాధితుల పక్షాన నిలబడడమే కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా ఉంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం వడమాలపేట (మం) ఏఎం పురం ఎస్టీ కాలనీ చేరుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత అఘాయిత్యానికి గురై హత్య చేయబడిన చిన్నారి తల్లిదండ్రులకు 10లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు అందజేశారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి నిందితుడిని శిక్షిస్తామన్నారు.