
సత్యవేడు: మార్చి 22వ తేదీన జాబ్ మేళా
సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రాంగణంలో మార్చి 22వ తేదీన జాబ్ మేళా జరుగుతుందని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఉషాదేవి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, డీఆర్డిఏ, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆమె చెప్పారు. మరిన్ని వివరాల కోసం పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చైతన్య చక్రవర్తిని సంప్రదించాలని కోరారు.