రాష్ట్రంలోని జర్నలిస్టుల అపరిష్కృత సమస్యల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ విజయం సాధిస్తుందని ఏపీ ఎంఎఫ్ జిల్లా నూతన అధ్యక్షుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి గా తిరుపతిలో ఈనెల 23న మహాసభ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహాసభ లో చేసిన తీర్మానాలను వెల్లడించారు. ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుంచి పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా నేడు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఐజేయు నాయకులు, రాష్ట్ర నాయకులు కలసి అనేక దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్ కార్డుల మంజూరులో నిభంధనలు సడలించి అందరికీ అవకాశాలు కల్పించాలని , హెల్త్ కార్డుల మంజూరులో లోపాలను సరిదిద్దాలని, అదేవిధంగా కరోనాకు ముందుగా నిలిపివేసిన రైల్వే పాసులను తిరిగి పునరుద్దరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ
ఈ సమావేశంలో తీర్మానాలు ఆమోదించినట్లు కోలా లక్ష్మీపతి పేర్కొన్నారు. ఈ మహాసభలో ఏపిఎమ్ఎఫ్ తిరుపతి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రని వివరాలను ఆయన ప్రకటించారు.
ఏపిఎమ్ఎఫ్ జిల్లా కమిటి నూతన అధ్యక్షుడిగా కోలా లక్ష్మీపత, అధ్యక్షులుగా కోలా లక్ష్మీపతి, ఉపాధ్యక్షులుగా జి. అశోక్, ఓ. వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా టి మురళి రెడ్డి, సహాయ కార్యదర్శులు గా ఎస్. బాలసుబ్రమణ్యం, కె హనుమంత్ రెడ్డి, కోశాధికారిగా పి. యాసిన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కే. ప్రతాప్, జి. త్యాగరాజు, కే. లోకనాథం, ఎం. బాబు, ఎమ్. ప్రవీణ్ కుమార్, జి. సూర్యనారాయణ, వి. సుధీర్ కుమార్, పి. కృష్ణమూర్తి, ఎం. హరి, డి. ప్రసాద్, వి. ముని రాజా లు ఎన్నికైనట్లు ప్రకటించారు.