నూతన సంవత్సరం సందర్భంగా ఎర్రావారిపాలెం మండలం తలకోన శ్రీసిద్ధేశ్వరస్వామి వారిని బుధవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వరస్వామి వారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలసి దర్శించడం ఆనవాయితీ. స్వామి వారి దర్శనానంతరం ముఖ మండపంలో అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.