సంక్రాంతి సంబరాలకు చిత్తూరు జిల్లా ముస్తాబైంది. కొత్త అల్లుళ్లు, గాలి పటాలు, పట్టణాల నుంచి గ్రామాలకు యువకుల రాకతో ఈ వారం రోజులు ఉండే సందడి అంతా ఇంతా కాదు. తెలుగు వారికి సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. పండుగకు కేవలం ఒక్క రోజే ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో మహిళలు అందంగా ముగ్గులు వేసి సిద్ధమవుతున్నారు. దీంతో ఎక్కడ చూసిన పండగ సందడి నెలకొంది. మరోవైపు గ్రామాల్లో ముగ్గుల పోటీలు సైతం శనివారం ప్రారంభం అయ్యాయి.