అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

70చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్
చిత్తూరు జిల్లాలో ఈ నెల 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో 24×7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో 9491077356 నంబర్ కు ఫోన్ చేయాలని సోమవారం సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్