‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)’లో వృద్ధుల కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలున్నాయి. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ వైద్యాలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ పథకంలో ఇప్పటికే చేర్చారు.