రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్ ఎస్. సత్యనారాయణ టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అదనపు ఈవో అందించారు.