చిత్తూరు జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అన్ని పోలింగ్ కేంద్రాలలో శని, ఆదివారాలలో నిర్వహిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలోని 1776 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు ఆర్జీలను స్వీకరిస్తారన్నారు. ఓటర్ల నమోదు, సవరణకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.