TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఐదు డీఏల్లో ఒకటి లేదా రెండు చెల్లించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. గురువారం జేఏసీ నేతలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటిస్తానని తెలియజేశారు. దీంతో ప్రభుత్వం చెప్పే శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 26న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపాక ప్రకటించే డీఏ చెల్లించే అవకాశం ఉందని సమాచారం.