Oct 19, 2024, 13:10 IST/
మహిళ కడుపులో 12 ఏళ్ల తరువాత బయటపడిన కత్తెర
Oct 19, 2024, 13:10 IST
సిక్కింలో షాకింగ్ ఘటన జరిగింది. 45 ఏళ్ల ఓ మహిళ కడుపులో 12 ఏళ్ల తర్వాత ఓ కత్తెర బయటపడింది. అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కత్తెరను మహిళ పొత్తి కడుపులోనే వదిలేశారు. 2012లో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కత్తెరని వదిలేశారు. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే ఉంది. అయితే తాజాగా ఆమెకు ఎక్స్-రే తీయగా సర్జికల్ కత్తెర బయటపడింది. వైద్యులు వెంటనే ఆపరేషన్ నిర్వహించి కత్తెరని బయటకు తీశారు.