కార్వేటి నగరం: పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ ఓ

61చూసినవారు
కార్వేటి నగరం: పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ ఓ
జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం కత్తెలపల్లి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం చిత్తూరు జిల్లా డి ఎం హెచ్ ఓ ప్రభావతి దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి పరిసరాలను చూశారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన వైద్య సదుపాయాలను అందిస్తున్నారని సంగతిని నిశితంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్