జ్ఞానం లేని లోకేష్ నీకెందుకు రాజకీయం

3702చూసినవారు
జ్ఞానం లేని లోకేష్ నీకెందుకు రాజకీయం
జ్ఞానం లేని లోకేష్ నీకెందుకు రాజకీయమని డిసిసిబి డైరెక్టర్ బాల సుబ్రమణ్యం రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర జనాలు లేక బోసిపోవడంతో, ఆవేశంతో అక్కుసుతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అర్థం లేని ఆరోపణలు చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడడం టిడిపి పార్టీకే చెందుతుందని అన్నారు.
కార్వేటి నగరం మండలంలో డిఎం పురంలో మాట్లాడుతూ రోడ్లు సరిగా లేవని, గ్రామాల్లో డ్రైనేజ్ సౌకర్యం లేవని, జగనన్న ఇంటి స్థలం అర్హులకు మంజూరు చేయలేదని, మండలంలోని జూనియర్ డిగ్రీ కళాశాల లేదని రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని చెప్పిన లోకేష్ కి పూర్తిగా అవగాహన లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గంగాధరలు నియోజకవర్గంలోని మొదటి జూనియర్ , డిగ్రీ, ఐటి కళాశాల కార్వేటి నగర్ మండలంలో మంజూరు చేయడం జరిగిందని, గత 30 సంవత్సరములుగా విద్యార్థులు ఆ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని, అర్హులకి జగనన్న ఇంటి పట్టా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి తలపెట్టిన బహుత్కరమైన కార్యక్రమం తలపెట్టి రాష్ట్రంలోనే 31 లక్షల మందికి జగనన్న ఇంటి పట్టా మంజూరు చేయడం జరిగిందన్నారు.

మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేసిన చరిత్ర వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అన్నారు. నీకు స్క్రిప్ట్ రాసిచ్చిన మేధావులకి, నీకు వత్తాసు పలుకుతున్న మీ టిడిపి నాయకులకి నీలాగే జ్ఞానం లేదని రుజువైందన్నారు. మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడు లోకేష్ నోరు ఉంది కదా అని నిజాలని అబద్ధం చేయలేరు కదా. నువ్వు ఆరోపించిన ప్రతి అంశము డిప్యూటీ సీఎం. నారాయణస్వామి అమలు పరిచారని. నియోజకవర్గంలోని కార్వేటినగరం పెనుమూరు మండలానికి 50 పడకల ఆసుపత్రి అప్డేట్ చేసి నిర్మాణాలు జరుగుతుంది నీకు మీ నాయకులకి కళ్ళు కనబడడం లేదా. దమ్ముంటే రండి మేం చేసిన అభివృద్ధిని చూపిస్తాం. 14 సంవత్సరములు అధికారంలో ఉన్న టిడిపి నియోజకవర్గ అభివృద్ధికి మీరేం చేశారు ప్రజలకు చెప్పండి చూద్దాం అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, నాయకులు కుప్పయ్య, జనార్ధన్, మణి, బాబు, డి ఎస్ రాజు, మహేష్ , అమృత రాజు, రామచంద్ర యాదవ్, ప్రమీల, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్